ఈవీఎంలకు ‘భాజపా ట్యాగ్‌’లు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపణ

ఆరో విడత పోలింగ్‌ వేళ ఈవీఎంలకు ‘భాజపా ట్యాగ్‌’లు పశ్చిమ బెంగాల్‌లో కలకలం సృష్టించాయి. బాంకురా జిల్లాలోని కొన్ని ఓటింగ్‌ యంత్రాలపై భాజపా అని రాసి ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

Published : 26 May 2024 04:07 IST

కోల్‌కతా: ఆరో విడత పోలింగ్‌ వేళ ఈవీఎంలకు ‘భాజపా ట్యాగ్‌’లు పశ్చిమ బెంగాల్‌లో కలకలం సృష్టించాయి. బాంకురా జిల్లాలోని కొన్ని ఓటింగ్‌ యంత్రాలపై భాజపా అని రాసి ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ‘‘ఈవీఎంలను ట్యాంపర్‌ చేసి భాజపా ఓట్ల రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తోందని సీఎం మమతా బెనర్జీ పలుమార్లు చెప్పారు. ఈ రోజు అది బయటపడింది. బాంకురా జిల్లాలోని రఘునాథ్‌పుర్‌లో 5 ఈవీఎంలకు భాజపా ట్యాగ్‌లు కనిపించాయి. దీనిపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’లో ఆరోపించింది. ఈ పోస్ట్‌కు ట్యాగ్‌ల ఫొటోలను జత చేసింది. దీనిపై ఈసీ స్పందించింది. ‘‘పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను పెట్టినప్పుడు కామన్‌ అడ్రస్‌ ట్యాగ్‌లను ఇస్తుంటాం. వాటిపై అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటాం. మీరు (టీఎంసీ) పేర్కొన్న కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టిన సమయంలో భాజపా అభ్యర్థికి చెందిన ఏజెంట్‌ మాత్రమే అందుబాటులో ఉన్నారు. అందుకే ఆయన సంతకం తీసుకున్నాం. ఆ తర్వాత పోలింగ్‌ జరుగుతున్న సమయంలో మిగతా ఏజెంట్ల సంతకాలు కూడా వాటిపై పెట్టించాం’’ అని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు