మోదీ మళ్లీ సీఎం కావాలి.. ప్రచార సభలో నీతీశ్‌

బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ ప్రచారంలో తడబడ్డారు. నరేంద్రమోదీ మరోమారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అధికార ఎన్డీయే తరఫున ఆదివారం పట్నాలో ప్రచారం చేసిన ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

Published : 27 May 2024 06:35 IST

పట్నా: బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ ప్రచారంలో తడబడ్డారు. నరేంద్రమోదీ మరోమారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అధికార ఎన్డీయే తరఫున ఆదివారం పట్నాలో ప్రచారం చేసిన ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘‘మేం (ఎన్డీయే) దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో గెలవాలని, నరేంద్రమోదీ మరోమారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. అప్పుడే భారత్‌ అభివృద్ధి చెందుతుంది. బిహార్‌ అభివృద్ధి చెందుతుంది. ప్రతిదీ జరుగుతుంది’’ అని నీతీశ్‌ పేర్కొన్నారు. అక్కడే ఉన్న నేతలు అప్రమత్తం చేయడంతో ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని సరిచేసుకున్నారు. మోదీ మరోమారు ప్రధాని కావాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు