తాడిపత్రి అల్లర్ల కేసులో 11 మందికి రిమాండ్‌

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన రాళ్లదాడిలో తెదేపా, వైకాపాలకు చెందిన 11 మందిని అరెస్టు చేశామని పట్టణ ఎస్సై గౌస్‌బాషా తెలిపారు.

Updated : 27 May 2024 05:45 IST

తాడిపత్రి, ఉరవకొండ, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన రాళ్లదాడిలో తెదేపా, వైకాపాలకు చెందిన 11 మందిని అరెస్టు చేశామని పట్టణ ఎస్సై గౌస్‌బాషా తెలిపారు. ఓంశాంతినగర్, సూర్యముని ఇంటి వద్ద,  ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో వైకాపా, తెదేపా వర్గీయులు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నాయన్నారు.. ఈ ఘటనకు సంబంధించి తాడిపత్రికి చెందిన ఏడుగురు, యాడికి మండలానికి చెందిన నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిలో ఏడుగురు తెదేపా, నలుగురు వైకాపాకు చెందిన కార్యకర్తలు ఉన్నారన్నారు. 11 మందిని ఉరవకొండ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి దుర్గాకల్యాణి ఎదుట హాజరుపరిచామన్నారు. న్యాయమూర్తి నిందితులను రిమాండ్‌కు ఆదేశించారన్నారు.


150 మందిపై రౌడీషీట్‌ 

తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో తెదేపా, వైకాపాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలపై రౌడీషీట్‌ నమోదు చేశామని డీఎస్పీ జనార్దననాయుడు తెలిపారు. పోలింగ్‌రోజు, ఆ తరవాత తాడిపత్రిలో పలుచోట్ల జరిగిన రాళ్లదాడులు, ఇతర కేసుల్లో ప్రమేయం ఉన్న 150 మందిపై రౌడీషీట్‌ తెరిచామన్నారు. వారిలో తాడిపత్రికి చెందిన 106 మంది, యాడికికి చెందిన 37 మంది, పెద్దవడుగూరు మండలానికి చెందిన ఏడుగురు ఉన్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని