స్టాంపు లేకపోతే ఆమోదించకూడదని లేదు

పోస్టల్‌ బ్యాలట్‌ డిక్లరేషన్‌ ఫాంపై గెజిటెడ్‌ అధికారి స్టాంపు లేకపోయినా, బ్యాలట్‌ పేపర్‌పై ఫాస్‌ మెయిల్‌ లేకపోయినా, బ్యాలట్‌ కవర్‌పై ఓటరు సంతకం లేకపోయినా ఈ మూడు సందర్భాల్లో ఎక్కడా పోస్టల్‌ బ్యాలట్‌ను తిరస్కరించకూడదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు.

Updated : 30 May 2024 05:05 IST

పోస్టల్‌ బ్యాలట్‌పై ఈసీ ఉత్తర్వులపై వైకాపా దుష్ప్రచారం 
తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు  

ఈనాడు డిజిటల్, అమరావతి: పోస్టల్‌ బ్యాలట్‌ డిక్లరేషన్‌ ఫాంపై గెజిటెడ్‌ అధికారి స్టాంపు లేకపోయినా, బ్యాలట్‌ పేపర్‌పై ఫాస్‌ మెయిల్‌ లేకపోయినా, బ్యాలట్‌ కవర్‌పై ఓటరు సంతకం లేకపోయినా ఈ మూడు సందర్భాల్లో ఎక్కడా పోస్టల్‌ బ్యాలట్‌ను తిరస్కరించకూడదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. పోస్టల్‌ బ్యాలట్‌పై ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలపై కనీస అవగాహన లేని వైకాపావాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీకి తెదేపా వైరస్‌ సోకిందంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్నీ తీవ్రంగా ఖండించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఈసారి పెద్ద సంఖ్యలో పోస్టల్‌ బ్యాలట్లు వచ్చాయి. ఒత్తిడిలో చిన్నచిన్న పొరపాట్లు జరిగాయి. వాటిని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. వీటిని మన్నించి ఓటు వృథా కాకుండా చూడాలని కోరాం. దీనికి వైకాపా వాళ్లు వక్రభాష్యాలు చెబుతున్నారు. ఉద్యోగులంతా ప్రభుత్వంపై  ఉన్న తమ ఆగ్రహాన్ని ఓటు ద్వారా చూపించారనే భయంతో తప్పుడు ప్రచారాలకు పూనుకున్నారు. అసలు తెదేపా తరఫున 750 ఫిర్యాదులిస్తే  కేవలం రెండింటికే ఈసీ వివరణ ఇచ్చింది’ అని అశోక్‌బాబు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని