బిహార్‌లో భాజపాకు మొట్టికాయ

బిహార్‌లో 2019 ఎన్నికలతో పోలిస్తే అధికార ఎన్‌డీయే కూటమిలో ప్రధాన పక్షాలైన భాజపా, జేడీయూ సీట్లలో కోత పడింది. గత ఎన్నికల్లో కమల దళం 17 స్థానాల్లో విజయం సాధించగా ఈ దఫా 12 చోట్లకే పరిమితమైంది.

Published : 05 Jun 2024 05:43 IST

పట్నా: బిహార్‌లో 2019 ఎన్నికలతో పోలిస్తే అధికార ఎన్‌డీయే కూటమిలో ప్రధాన పక్షాలైన భాజపా, జేడీయూ సీట్లలో కోత పడింది. గత ఎన్నికల్లో కమల దళం 17 స్థానాల్లో విజయం సాధించగా ఈ దఫా 12 చోట్లకే పరిమితమైంది. 2014లో 22 ఎంపీ స్థానాలు గెలుపొందడం గమనార్హం. జేడీయూ 2019లో 16 లోక్‌సభ స్థానాలు గెలుపొందగా ఈసారి 12 స్థానాలు దక్కించుకుంది. మరో మిత్రపక్షం లోక్‌జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్‌) పోటీ చేసిన 5 స్థానాల్లోనూ గెలుపుబాట పట్టింది. రాష్ట్రం నుంచి ఎన్‌డీయే ఖాతాలోకి 30 ఎంపీ సీట్లు చేరాయి. విపక్ష ఇండియా కూటమిలోని ఆర్జేడీ (4), కాంగ్రెస్‌ (3), సీపీఐ (ఎంల్‌)(ఎల్‌) (2) స్థానాలు గెలిచాయి. స్వతంత్ర అభ్యర్థి పప్పూయాదవ్‌ (పూర్ణియా) నుంచి గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని