గుజరాత్‌లో హ్యాట్రిక్‌ చేజార్చుకున్న భాజపా

కంచుకోట గుజరాత్‌లో అధికార భాజపా లోక్‌సభ ఎన్నికల్లో తన పట్టును నిలుపుకొంది. మొత్తం 26 స్థానాలకు గాను 25 చోట్ల కమలదళ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.

Published : 05 Jun 2024 05:44 IST

అహ్మదాబాద్‌: కంచుకోట గుజరాత్‌లో అధికార భాజపా లోక్‌సభ ఎన్నికల్లో తన పట్టును నిలుపుకొంది. మొత్తం 26 స్థానాలకు గాను 25 చోట్ల కమలదళ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో 26 సీట్లనూ గెలుచుకుని భాజపా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ దఫా ఒక స్థానంలో ఓటమితో హ్యాట్రిక్‌ను చేజార్చుకుంది. కేంద్రమంత్రులు అమిత్‌ షా, మన్‌సుఖ్‌ మాండవీయ, పరుషోత్తమ రూపాల, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ భారీ మెజారిటీతో విజయం సాధించారు. సూరత్‌లో భాజపా అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం వివాదాస్పదమైంది. అక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థి, ఆ పార్టీ మరో డమ్మీ అభ్యర్థుల నామినేషన్లలో అవకతవకలున్నాయంటూ వారి నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడంతో దలాల్‌ పోటీ లేకుండా గెలిచారు. కమలదళానికి గట్టిపట్టున్న రాష్ట్రంలో బనాస్‌కాంఠా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి జెనిబెన్‌ థాకర్‌ అనూహ్య విజయం సాధించారు. మరోపక్క లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్రంలో అయిదు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా విజయఢంకా మోగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని