హరియాణాలో అధికార భాజపాకు దెబ్బ

హరియాణాలో కాంగ్రెస్‌ అయిదు పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకొని అధికార భాజపాకు షాక్‌ ఇచ్చింది. వచ్చే అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఈ రాష్ట్రంలో 2019 పోరులో కమలదళం పదికి పది స్థానాలు దక్కించుకోవడం గమనార్హం.

Published : 05 Jun 2024 07:18 IST

10 నుంచి 5కు తగ్గుదల.. కాంగ్రెస్‌ ఖాతాలో మిగతా ఐదు

చండీగఢ్‌: హరియాణాలో కాంగ్రెస్‌ అయిదు పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకొని అధికార భాజపాకు షాక్‌ ఇచ్చింది. వచ్చే అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఈ రాష్ట్రంలో 2019 పోరులో కమలదళం పదికి పది స్థానాలు దక్కించుకోవడం గమనార్హం. కాంగ్రెస్‌ నుంచి కుమారి సెల్జా(సిర్సా), దీపిందర్‌ సింగ్‌ హుడా(రోహతక్‌).. భాజపా నుంచి మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌(కర్నల్‌) విజయం దక్కించుకున్నారు. కర్నల్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రస్తుత సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ భారీ మెజార్టీతో గెలిచి పీఠాన్ని పదిలం చేసుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఖట్టర్‌ను తొలగించి సైనీని ముఖ్యమంత్రిగా భాజపా అధిష్ఠానం మార్చడం గమనార్హం. 2019లో 58 శాతం ఉన్న భాజపా ఓట్ల శాతం ప్రస్తుతం 46కు పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్‌ మాత్రం 28.42 శాతం నుంచి 43.68 శాతానికి ఎగబాకడం విశేషం. కురుక్షేత్ర స్థానం నుంచి నవీన్‌ జిందాల్‌ విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్రంలో ప్రభావవంతమైన చౌతాలా కుటుంబం నుంచి పోటీ చేసిన నలుగురు అభ్యర్థుల పరాజయం పాలవడం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని