పిన్న వయస్కుడు వంశీ.. సీనియర్‌ మల్లు రవి

రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన వారిలో పెద్దపల్లికి ప్రాతినిధ్యం వహించనున్న గడ్డం వంశీకృష్ణ చిన్న వయస్కుడు కాగా నాగర్‌కర్నూల్‌ నుంచి గెలుపొందిన డాక్టర్‌ మల్లు రవి వయసులో పెద్దవారు.

Published : 06 Jun 2024 04:01 IST

ఎంపీల్లో ఆరు పదులు దాటిన వారు ఆరుగురు

మేడిపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఎన్నికైన వారిలో పెద్దపల్లికి ప్రాతినిధ్యం వహించనున్న గడ్డం వంశీకృష్ణ చిన్న వయస్కుడు కాగా నాగర్‌కర్నూల్‌ నుంచి గెలుపొందిన డాక్టర్‌ మల్లు రవి వయసులో పెద్దవారు. 50 ఏళ్లలోపు వయసు ఉన్న ఎంపీలు ఐదుగురు ఉన్నారు. పలువురు విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేయగా మిగిలిన వారు విభిన్న డిగ్రీలు పొందారు.

50 ఏళ్లలోపు వయసు వారు: పెద్దపల్లి - గడ్డం వంశీకృష్ణ(35), వరంగల్‌ - కడియం కావ్య(41), నల్గొండ - కుందూరు రఘువీర్‌(44), నిజామాబాద్‌ - ధర్మపురి అర్వింద్‌(47), భువనగిరి - చామల కిరణ్‌కుమార్‌రెడ్డి(47).

51-60 ఏళ్ల వయసు వారు: కరీంనగర్‌ - బండి సంజయ్‌(52), హైదరాబాద్‌ - అసదుద్దీన్‌ ఒవైసీ(54), మెదక్‌ - మాధవనేని రఘునందన్‌రావు(59), ఆదిలాబాద్‌ - గోడం నగేష్‌(59), మహబూబాబాద్‌ - పోరిక బలరాంనాయక్‌(60), మల్కాజిగిరి - ఈటల రాజేందర్‌(60).

61-70 వయసు వారు: సికింద్రాబాద్‌ - జి.కిషన్‌రెడ్డి (63), ఖమ్మం - రామసహాయం రఘురాంరెడ్డి(63), మహబూబ్‌నగర్‌ - డీకే అరుణ(64), జహీరాబాద్‌ - సురేశ్‌ కుమార్‌ షెట్కార్‌(63), చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(64)

70 ఏళ్లు దాటిన వారు: నాగర్‌కర్నూల్‌ - మల్లు రవి(73).

లాయర్లు.. డాక్టర్లు.. విదేశాల్లో చదువులు 

  • కొండా విశ్వేశ్వర్‌రెడ్డి యూఎస్‌లో ఎం.ఎస్‌., రామసహాయం రఘురాంరెడ్డి ఇంగ్లండ్‌లో పీజీ డిప్లొమా ఆఫ్‌ ప్రొఫిషియెన్సీ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సైప్రస్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్, గడ్డం వంశీకృష్ణ యూఎస్‌లో సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు.
  • ఎంపీల్లో ఇద్దరు వైద్యులున్నారు. కడియం కావ్య ఎండీ(పాథాలజీ), మల్లు రవి ఎంబీబీఎస్‌ చదివారు. 
  • సురేశ్‌ షెట్కార్‌ బీఎస్సీ అగ్రికల్చర్, ఈటల రాజేందర్‌ బీఎస్సీ, గంగాపురం కిషన్‌రెడ్డి టూల్‌ డిజైన్స్‌లో డిప్లొమా పొందారు. 
  • మాధవనేని రఘునందన్‌రావు బీఎస్సీ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ, అసదుద్దీన్‌ ఒవైసీ లండన్‌లో బారిస్టర్‌ పూర్తి చేశారు.
  • బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌ ఎంఏ; గోడం నగేష్‌ ఎంఏ ఎంఈడీ అభ్యసించారు.
  • డీకే అరుణ, కుందూరు రఘువీర్‌ ఇంటర్‌ చదివారు.
  • బలరాంనాయక్‌ పదో తరగతి విద్యార్హత కలిగి ఉన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని