శరద్‌ పవార్‌ ‘సూపర్‌హిట్‌’

శరద్‌ పవార్‌ నుంచి విడిపోయి ఎన్డీయే కూటమిలో చేరిన అజిత్‌ పవార్‌కు లోక్‌సభ ఎన్నికల్లో గట్టి షాక్‌ తగిలింది. మరోవైపు శరద్‌ పవార్‌ పార్టీ (ఎన్సీపీ-ఎస్పీ) ఘన విజయాలను నమోదు చేసింది.

Published : 06 Jun 2024 06:55 IST

ముంబయి: శరద్‌ పవార్‌ నుంచి విడిపోయి ఎన్డీయే కూటమిలో చేరిన అజిత్‌ పవార్‌కు లోక్‌సభ ఎన్నికల్లో గట్టి షాక్‌ తగిలింది. మరోవైపు శరద్‌ పవార్‌ పార్టీ (ఎన్సీపీ-ఎస్పీ) ఘన విజయాలను నమోదు చేసింది. 10 స్థానాల్లో పోటీ చేసిన శరద్‌ పవార్‌ పార్టీ 8 చోట్ల గెలిచి 80 శాతం స్ట్రైక్‌ రేటును సాధించింది. నాలుగు సీట్లలో పోటీ చేసిన అజిత్‌ పార్టీ ఒక చోటే గెలిచింది.

  • 2019 ఎన్నికల్లో ఒక సీటే గెలుచుకున్న కాంగ్రెస్‌ ఈసారి 17 చోట్ల పోటీ చేసి 13 చోట్ల గెలిచింది. ఆ పార్టీ స్ట్రైక్‌ రేటు 75శాతంగా ఉంది. 
  • 28 చోట్ల పోటీ చేసిన భాజపా 9 స్థానాల్లోనే గెలిచింది. ఆ పార్టీ స్ట్రైక్‌ రేటు 31శాతంగా ఉంది.
  • ఏక్‌నాథ్‌ శిందే శివసేన 15 చోట్ల పోటీ చేసి 7 చోట్ల విజయం సాధించింది. ఆ పార్టీ స్ట్రైక్‌ రేటు 45శాతంగా ఉంది.
  • ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన 21చోట్ల పోటీ చేసి 9 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ స్ట్రైక్‌ రేటు 41శాతంగా ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు