రాజస్థాన్‌లోనే అధిక నష్టం!

దేశవ్యాప్తంగా భాజపాకు తగ్గిన ఓట్ల శాతం ఒక శాతంలోనే ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో భారీగా కోల్పోయింది. ఆ లోటును మిగిలిన రాష్ట్రాల ద్వారా భర్తీ చేసుకోవడంతో దేశవ్యాప్త లోటులో పెద్దగా తేడా కనిపించలేదు.

Published : 07 Jun 2024 05:23 IST

భారీగా ఓట్లను కోల్పోయిన భాజపా
ఒడిశాలో పెరిగిన ఓట్లు
(జైపుర్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ)

దేశవ్యాప్తంగా భాజపాకు తగ్గిన ఓట్ల శాతం ఒక శాతంలోనే ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో భారీగా కోల్పోయింది. ఆ లోటును మిగిలిన రాష్ట్రాల ద్వారా భర్తీ చేసుకోవడంతో దేశవ్యాప్త లోటులో పెద్దగా తేడా కనిపించలేదు. 

  • దేశంలోనే అత్యధిక ఓట్లను రాజస్థాన్‌లో భాజపా కోల్పోయింది. ఈ రాష్ట్రంలో 2019తో పోలిస్తే 9.23 శాతం ఓట్లు ఆ పార్టీకి తగ్గాయి. ఫలితంగా 11 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. 2024లో భాజపా 49.24 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్‌కు 37.91 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో బలమైన జాట్‌లు ఈసారి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. వారితోపాటు మీనాలు, గుజ్జర్లు కాంగ్రెస్‌ వెంటే నిలిచారు. రాష్ట్రంలోని 7 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో 4 గెలుచుకుని కాంగ్రెస్‌ రికార్డు సృష్టించింది. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తి వేస్తుందన్న ప్రచారం ఫలించింది.
  • ఒడిశాలో భాజపా 2019తో పోలిస్తే 6.96శాతం ఓట్లను పెంచుకుంది. ఫలితంగా 20 సీట్లను     సాధించింది. 
  • రాజస్థాన్‌ తర్వాత ఉత్తర్‌ ప్రదేశ్‌లో భాజపా భారీగా నష్టపోయింది. ఈ రాష్ట్రంలో 8.18శాతం ఓట్లను ఆ పార్టీ నష్టపోయింది. 
  • మహారాష్ట్రలో 1.31శాతం ఓట్లే తగ్గినా సీట్ల పరంగా భారీగా నష్టం కలిగింది. 
  • కర్ణాటకలో 5.32 శాతం ఓట్లను కోల్పోయిన భాజపా సీట్ల విషయంలో మెరుగ్గానే నిలిచింది.
  • పశ్చిమ బెంగాల్‌లో 1.52శాతం, బిహార్‌లో 3.11 శాతం, గుజరాత్‌లో 0.35శాతం, మధ్యప్రదేశ్‌లో 1.27శాతం, కేరళలో 3.75శాతం ఓట్లను భాజపా కోల్పోయింది. 
  • 7 రాష్ట్రాల్లో 72 సీట్లను  కోల్పోయిన భాజపా.. ఒడిశాలో 12 స్థానాలను అధికంగా సాధించింది.

లాభపడిన కాంగ్రెస్‌

2019తో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీ 47 సీట్లను అదనంగా సాధించింది. 6 రాష్ట్రాల్లోనే 36 సీట్లు గెలుచుకుంది. 

కర్ణాటకలో అత్యధికంగా 13.6శాతం అదనపు ఓట్లను గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని