నిధులు అడిగేందుకు వెళ్లి అవమానపడ్డాం

ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఇస్తానని చెప్పి వైకాపా అధినేత జగన్‌ తమను రెండు సార్లు మోసం చేశారని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త, తెదేపా నాయకుడు సురేష్‌ కుమార్‌లు విమర్శించారు.

Published : 08 Jun 2024 05:53 IST

జగన్‌ దుర్భాషలు బయటకు చెప్పుకోలేం
చంద్రబాబు మార్గదర్శకంలో పనిచేస్తాం
ఉమ్మడి గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, సురేష్‌కుమార్‌ దంపతులు 

మాట్లాడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, పక్కన సురేష్‌కుమార్, మేరుగ విజయలక్ష్మి

గుంటూరు (జిల్లాపరిషత్తు), న్యూస్‌టుడే: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఇస్తానని చెప్పి వైకాపా అధినేత జగన్‌ తమను రెండు సార్లు మోసం చేశారని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త, తెదేపా నాయకుడు సురేష్‌ కుమార్‌లు విమర్శించారు. గుంటూరులోని జిల్లాపరిషత్తు కార్యాలయంలో శుక్రవారం క్రిస్టినా మీడియాతో మాట్లాడారు. ‘2014, 2019 ఎన్నికల్లో మాకు టికెట్‌ ఇస్తామని చెప్పి వేరేవారికి ఇచ్చారు. మధ్యలో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించినా అభివృద్ధి పనులకు నిధులివ్వాలని జగన్‌ను వంద సార్లు కలిసి వినతిపత్రాలిస్తే ఐఏఎస్‌ అధికారులు ధనుంజయరెడ్డి, కేఎన్‌ఆర్‌లకు ఇవ్వమనేవారు. వారు ఆ దరఖాస్తులను చెత్త బుట్టలో పడేసేవారు. నిధులివ్వాలని కోరేందుకు వెళ్లినప్పుడు జగన్‌ దుర్భాషలాడారు. ఆ విషయాలు బయటకు చెప్పుకోలేను’ అని తెలిపారు. పార్టీలో గౌరవం లేకపోవడంతో ఎన్నికలకు ముందే లోకేశ్, చంద్రబాబులను కలిసి మాట్లాడడంతో పార్టీలో చేర్చుకున్నారు. శనివారం జడ్పీటీసీ సభ్యులతో కలిసి సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం. ఆయన పరిష్కరిస్తారని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కత్తెర సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ జగన్‌ను నమ్ముకుని పార్టీ ఇన్‌ఛార్జులుగా పని చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని