తెదేపా, జేడీయూ స్పీకర్‌ పోస్టు తీసుకుంటే ‘సేఫ్‌’ : ఆదిత్య ఠాక్రే

కేంద్రంలో మూడోవిడత ఎన్డీయే సర్కారు ఏర్పాటులో కీలక భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్‌ (యు) తప్పనిసరిగా లోక్‌సభ స్పీకర్‌ పోస్టు కోరుకోవాలని శివసేన (ఉద్ధవ్‌) యువనేత ఆదిత్య ఠాక్రే అభిప్రాయపడ్డారు.

Published : 08 Jun 2024 06:28 IST

ముంబయి: కేంద్రంలో మూడోవిడత ఎన్డీయే సర్కారు ఏర్పాటులో కీలక భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్‌ (యు) తప్పనిసరిగా లోక్‌సభ స్పీకర్‌ పోస్టు కోరుకోవాలని శివసేన (ఉద్ధవ్‌) యువనేత ఆదిత్య ఠాక్రే అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన మరుక్షణం నుంచి భాజపా తన మిత్రపక్షాలను చీల్చేందుకు ప్రయత్నిస్తుందని, ఇది భాజపా కుయుక్తులను చూసిన అనుభవంతో చెబుతున్న మాటగా శుక్రవారం ‘ఎక్స్‌’ ద్వారా ఆయన తెలిపారు. అందుకే స్పీకర్‌ పోస్టు తీసుకోవాలని భాజపా సర్కారులో చేరుతున్న పార్టీలను తాను సవియంగా కోరుతున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీలిన విధానాన్ని ఆదిత్య పరోక్షంగా ప్రస్తావించారు. ‘ఎక్స్‌’లో తెదేపా, జేడీయూల ఖాతాలకు తన వ్యాఖ్యలను ఆయన జోడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని