ఎన్నికల్లో దారుణ ప్రదర్శనకు భాజపా డప్పు : జైరాం

లోక్‌సభ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైతికంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగానూ ఓటమితో సమానమని, భాజపా శ్రేణులు ఈ దారుణమైన ప్రదర్శనకు డప్పు కొడుతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు.

Published : 09 Jun 2024 05:08 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైతికంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగానూ ఓటమితో సమానమని, భాజపా శ్రేణులు ఈ దారుణమైన ప్రదర్శనకు డప్పు కొడుతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఫలితాలు నైతిక స్థైర్యాన్ని పెంచాయన్నారు. 543 మంది సభ్యులున్న సభకు సగం కన్నా తక్కువగా కేవలం 240 స్థానాలు గెలిచిన భాజపా నిరాశాజనకమైన ఫలితాలను ఆశాజనకంగా చూపించే ప్రయత్నం చేస్తోందని ‘ఎక్స్‌’ ద్వారా ఆయన పోస్ట్‌ చేశారు. వరుసగా మూడుసార్లు మెజారిటీ ప్రభుత్వ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెహ్రూతో మోదీని పోల్చడం కూడా సరికాదన్నారు. పూర్తి ప్రజాస్వామ్యవాదిగా పార్లమెంటుతో చాలా జాగ్రత్తగా నెహ్రూ వ్యవహరించేవారని తెలిపారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కూడా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారని, ఇందిర నాలుగుసార్లు చేశారన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని