మెజారిటీలతో సత్తా చాటారు.. మంత్రి పదవులు చేపట్టారు

తాజా లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తొలి 10 మంది ఎంపీల్లో నలుగురు.. కేంద్రంలో నూతన మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం విశేషం.

Published : 10 Jun 2024 05:24 IST

- తొలి 10 స్థానాల్లో నిలిచిన నలుగురు ఎంపీలకు చోటు

దిల్లీ: తాజా లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తొలి 10 మంది ఎంపీల్లో నలుగురు.. కేంద్రంలో నూతన మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం విశేషం. ఆధిక్యం విషయంలో సత్తా చాటిన అమిత్‌ షా, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, సీఆర్‌ పాటిల్‌ ఆదివారం కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌.. విదిశ నుంచి ఎంపీగా గెలిచారు. ఈ దఫా ఆయన 8.21 లక్షల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. క్రితం సారి మోదీ ప్రభుత్వంలో హోం మంత్రిగా కొనసాగిన అమిత్‌ షా ఈ ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి 7.44 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. గత ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన సింధియా.. మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి 5.40 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యం సాధించారు. మరోవైపు సీఆర్‌ పాటిల్‌ గుజరాత్‌లోని నవ్‌సారి నుంచి 7.73 లక్షల మెజారిటీతో గెలుపొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని