జనసేన ఎమ్మెల్యేలంతా కలిసే ఎన్డీయే భేటీకి...

జనసేన తరఫున ఎన్నికైన శాసనసభ్యులందరితో మంగళవారం ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సమావేశం కానున్నారు.

Published : 11 Jun 2024 03:42 IST

అంతకుముందు జనసేన శాసనసభా పక్ష సమావేశం

ఈనాడు, అమరావతి: జనసేన తరఫున ఎన్నికైన శాసనసభ్యులందరితో మంగళవారం ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో మంగళవారం మూడు పార్టీల శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. విజయవాడలో ఈ సమావేశం ఉంటుంది. అంతకుముందే జనసేన తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమూ నిర్వహించాలని పవన్‌ నిర్ణయించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలోనే వీరు సమావేశమవుతారు. ఆ తర్వాత మొత్తం అంతా కలిసి ఎన్డీయే శాసనసభ్యుల సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించారు. అక్కడ ఎన్డీయే తరఫున శాసనసభపక్ష నేతను ఎన్నుకుని ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పిస్తారు.

విజయవాడ చేరుకున్న పవన్‌కల్యాణ్‌ 

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం విజయవాడ చేరుకున్నారు. అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకుని వచ్చారు. జనసేన తరఫున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కొందరు, తెదేపా నుంచి ఎన్నికైన మరికొందరు వచ్చి పవన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు అనేక మంది వచ్చి పార్టీ అధినేతను కలిసి అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని