ధనుంజయ్‌రెడ్డి.. మంత్రులనూ లెక్కచేసేవారు కాదు

సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన ధనుంజయ్‌రెడ్డి మంత్రులను సైతం లెక్కచేసేవారు కాదని విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Published : 11 Jun 2024 03:47 IST

జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్‌

విశాఖపట్నం(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన ధనుంజయ్‌రెడ్డి మంత్రులను సైతం లెక్కచేసేవారు కాదని విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. విశాఖలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సజ్జల.. కేవలం ప్రభుత్వ సలహాదారుడు మాత్రమేనని, ఆయనకు వైకాపాకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాదరెడ్డి.. వీసీలా కాకుండా వైకాపా కార్యకర్తగా వ్యవహరించారని, జగన్‌కు ఏజెంట్‌లా పనిచేశారని దుయ్యబట్టారు. నెలరోజుల్లో అన్నీ మారుతాయని తెలిపారు. తాజా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భాజపాలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్న ప్రశ్నకు.. ఆయన్ను ఎవరూ చేర్చుకోరని సమాధానమిచ్చారు. ఎంవీవీ, ఆయన అనుచరుడు జీవీ చేసిన అక్రమాలపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో జీవీఎంసీలో కూడా వైకాపా ఖాళీ అవుతుందని, మేయర్‌ కూడా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని