సురేశ్‌ గోపి రాజీనామాపై నకిలీ వార్తలు

కేరళ నుంచి భాజపా తరఫున లోక్‌సభకు ఎన్నికైన ఏకైక సభ్యుడు, నటుడు సురేశ్‌ గోపి ఆదివారం కేంద్ర  సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు.

Published : 11 Jun 2024 04:46 IST

దిల్లీ, తిరువనంతపురం: కేరళ నుంచి భాజపా తరఫున లోక్‌సభకు ఎన్నికైన ఏకైక సభ్యుడు, నటుడు సురేశ్‌ గోపి ఆదివారం కేంద్ర  సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. తరువాత తనకు మరిన్ని సినిమాలు చేయాలని ఉంది కాబట్టి మంత్రి పదవికి రాజీనామా చేస్తానని గోపి అన్నట్లు వార్తలొచ్చాయి. కేబినెట్‌ మంత్రి హోదా కానీ, స్వతంత్ర సహాయ మంత్రి హోదాకానీ ఇవ్వనందుకు గోపి అలిగారని, అందుకే మంత్రివర్గం నుంచి వైదొలగబోతున్నారని వదంతులొచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలని గోపి ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని