క్యాబినెట్‌ కూర్పులో పక్షపాతం: శివసేన(శిందే)

మంత్రులకు శాఖల్ని కేటాయించే విషయంలో కేంద్రంలోని అధికార సంకీర్ణ ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందని ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీ విమర్శించింది.

Published : 11 Jun 2024 04:47 IST

 

పుణె: మంత్రులకు శాఖల్ని కేటాయించే విషయంలో కేంద్రంలోని అధికార సంకీర్ణ ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందని ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీ విమర్శించింది. తమకు ఒకేఒక సహాయమంత్రి పదవితో సరిపెట్టడంపై పెదవి విరిచింది. భాజపా ఇస్తామన్న సహాయమంత్రి పదవి తీసుకునే బదులు క్యాబినెట్‌ బెర్తుకోసం ఎదురు చూస్తామని అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పార్టీ సోమవారం స్పందించింది. పదవుల కోసం బేరాలాడకుండా ఎన్డీయే కూటమి సర్కారుకు బేషరతు మద్దతు కొనసాగిస్తామని శివసేన (శిందే) పార్టీ నేత, ఎంపీ శ్రీకాంత్‌ శిందే స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఏడుస్థానాలు నెగ్గిన తమ పార్టీకి ఒక సహాయ మంత్రి పదవినిచ్చి, ఇంతకంటే తక్కువ స్థానాలు పొందిన పార్టీలకు క్యాబినెట్‌ స్థానాలిచ్చారని ఇదే పార్టీకి చెందిన మరో ఎంపీ శ్రీరంగ్‌ బర్నే ఆక్షేపించారు. భాజపాతో చిరకాల మైత్రి ఉన్న తమకు కనీసం ఒక క్యాబినెట్‌ మంత్రి పదవి, ఒక సహాయమంత్రి పదవి వస్తాయని ఆశించినట్లు చెప్పారు. జేడీయూ, తెదేపా తర్వాత కూటమిలో తమదే పెద్దపార్టీ అని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని