అమిత్‌షాతో ఈటల రాజేందర్‌ భేటీ

భాజపా నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ సోమవారం పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

Published : 11 Jun 2024 04:52 IST

రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకంపై చర్చ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం 

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ సోమవారం పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. దిల్లీలో ఆయన నివాసానికి వెళ్లిన ఈటల రాజేందర్‌ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం అమిత్‌షాను ఈటల కలవడం ఇదే తొలిసారి. కేంద్ర మంత్రి పదవులు, రాష్ట్ర భాజపా కొత్త అధ్యక్షుడి నియామకం వంటి అంశాలపై చర్చ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం ఆయన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తొలిసారి కేంద్ర సహాయ మంత్రిగా నియమితులైన బండి సంజయ్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి మోదీ నాయకత్వంలో లోక్‌సభ సభ్యుడిగా పనిచేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్‌లను కలిసి అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు