జగన్‌ ఓడిపోయినా రక్తచరిత్ర రాస్తున్నారు

వై.ఎస్‌.జగన్‌ ఎన్నికల్లో ఓడిపోయినా రక్తచరిత్ర రాస్తూనే ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Published : 11 Jun 2024 05:24 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజం 

ఈనాడు డిజిటల్, అమరావతి: వై.ఎస్‌.జగన్‌ ఎన్నికల్లో ఓడిపోయినా రక్తచరిత్ర రాస్తూనే ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకి చెందిన తెదేపా నేత గిరినాథ్‌ చౌదరి దారుణ హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘వైకాపా ఫ్యాక్షన్‌ పాలన వద్దని జనం ఛీకొట్టినా, బాబాయ్‌ని చంపించినట్టే జనాన్ని జగన్‌రెడ్డి చంపుతున్నారు. ఆయన హత్యా రాజకీయాల్ని ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గిరినాథ్‌ కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది. నిందితుల్ని వదిలే ప్రసక్తే లేదు. వైకాపా ఫ్యాక్షన్‌ దాడులకు చెక్‌ పెడతాం. శాంతిభద్రతల్ని కాపాడతాం’ అని లోకేశ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని