అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉండకుండా ప్రజల ఓటు

అధికారం ఒకరిద్దరి చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓటేశారని ఎన్సీపీ-ఎస్పీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ సోమవారం వ్యాఖ్యానించారు.

Published : 11 Jun 2024 05:31 IST

-శరద్‌ పవార్‌ వ్యాఖ్య

పుణె: అధికారం ఒకరిద్దరి చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓటేశారని ఎన్సీపీ-ఎస్పీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ సోమవారం వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని తెదేపా, నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ మద్దతులేకుండా 543 మంది సభ్యుల లోక్‌సభలో మెజారిటీ సంఖ్య 272ను సాధించలేని పరిస్థితి భాజపాకు ఎదురైందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో జరిగే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ కార్యకర్తలంతా సన్నద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారం తమ చేతికి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ఎన్సీపీ-ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి పవార్‌ ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని