ఇప్పటికైనా మెరుగ్గా పాలించండి

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భాజపాకు పెద్ద ఎదురుదెబ్బ అని సీపీఎం వ్యాఖ్యానించింది. సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించడంలో కమలం పార్టీ పూర్తిగా విఫలమైందని, దీనికి మోదీ ప్రభుత్వం అవలంబించిన నియంతృత్వ పద్ధతులే కారణమని ఆరోపించింది.

Published : 11 Jun 2024 05:33 IST

మోదీ అప్రజాస్వామ్య విధానాలను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి
పొలిట్‌బ్యూరో సమావేశంలో సీపీఎం

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భాజపాకు పెద్ద ఎదురుదెబ్బ అని సీపీఎం వ్యాఖ్యానించింది. సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించడంలో కమలం పార్టీ పూర్తిగా విఫలమైందని, దీనికి మోదీ ప్రభుత్వం అవలంబించిన నియంతృత్వ పద్ధతులే కారణమని ఆరోపించింది. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం హిందుత్వ నిరంకుశత్వాన్ని వీడి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని హితవు పలికింది. దిల్లీలో సోమవారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షించింది. 2024 ఎన్నికల్లో వామపక్షాలు స్వల్పంగా తమ ఉనికి మెరుగుపరుచుకున్నాయని వెల్లడించింది. కేరళలో ఎన్నికల పనితీరుపై మాత్రం నిరాశ వ్యక్తం చేసింది. దేశ ప్రజలు రాజ్యాంగాన్ని, లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించారని, భాజపాకు మెజార్టీ ఇవ్వకుండా హెచ్చరిక చేశారని తెలిపింది. భారత ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, ఎన్డీఏకు 43.31 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇండియా బ్లాక్‌కు 41.69 శాతం ఓట్లు వచ్చాయి. రెండు కూటముల మధ్య ఓట్ల శాతంలో తేడా 2 శాతమేనని సీపీఎం గుర్తు చేసింది. హిందుత్వ నిరంకుశ పోకడలు, హిందుత్వ- కార్పొరేట్‌ బంధాన్ని బలోపేతం చేసే చర్యలు, మోదీ అప్రజాస్వామ్య విధానాలను ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి పార్టీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని