వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలి

వానాకాలం వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచాలని, కేంద్రం గతంలో మాదిరిగా బియ్యం కొనుగోలు చేయాలని అఖిలపక్షం డిమాండ్‌ చేసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం

Published : 04 Dec 2021 05:23 IST

అఖిలపక్షం డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచాలని, కేంద్రం గతంలో మాదిరిగా బియ్యం కొనుగోలు చేయాలని అఖిలపక్షం డిమాండ్‌ చేసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి కోదండరాం(తెజస), చాడ వెంకట్‌రెడ్డి(సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), సాదినేని వెంకటేశ్వరరావు(న్యూడెమొక్రసీ), శ్రీపతి సతీష్‌(తెదేపా), సందీప్‌ చమార(ఇంటి పార్టీ) తదితరులు హాజరయ్యారు. భాజపా, తెరాసల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్రంలో ఖరీఫ్‌ వడ్ల కొనుగోలు పూర్తి కాకముందే యాసంగి వడ్లను కొనగోలుచేయబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చిచెప్పాయని విమర్శించింది. పార్టీలకు రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ప్రధానమైన నేపథ్యంలో రైతు సంక్షేమం కోసం నిలబడి, సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరముందని తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం మాటల యుద్ధం మాని బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరింది. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని, సౌకర్యాలను మెరుగుపర్చాలని అఖిలపక్షం డిమాండ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని