Published : 21 Jan 2022 04:59 IST

కాంగ్రెస్‌తోనే సమస్యలకు పరిష్కారం: రేవంత్‌

హస్తం పార్టీలో చేరిన జనగామ జిల్లా నేతలు

డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి.

చిత్రంలో పార్టీ నేతలు సుదర్శన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, చిన్నారెడ్డి, హర్కవేణుగోపాల్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు పలువురు గురువారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. 126 జీవో ద్వారా ఉద్యోగాల భర్తీ, బదిలీలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను తెచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ చర్యల వెనుక ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఉన్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరామర్శించలేదని ఆక్షేపించారు.

డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. గడువులోగా లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేయాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏప్రిల్‌ 14వ తేదీలోగా పంజాగుట్ట సర్కిల్‌లో ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను వి.హనుమంతరావు ఓ లేఖలో కోరారు.
 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని