YS Jagan: జగన్‌.. 11.. 11.. దేవుడి స్క్రిప్ట్‌ ఇదీ?

సీఎం జగన్‌కు దేవుడి స్క్రిప్ట్‌ ఏంటో అర్థమైందో.. లేదో అని సామాజిక మాధ్యమాలలో ట్రోల్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. వైకాపా 11 అసెంబ్లీ స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 164 స్థానాల్లో గెలిచారు.

Updated : 05 Jun 2024 10:17 IST

సీఎం జగన్‌కు దేవుడి స్క్రిప్ట్‌ ఏంటో అర్థమైందో.. లేదో అని సామాజిక మాధ్యమాలలో ట్రోల్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. వైకాపా 11 అసెంబ్లీ స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 164 స్థానాల్లో గెలిచారు. 1+6+4 మొత్తం  11 అవుతుంది. ఇదీ దేవుడి స్క్రిప్ట్‌ అని ఎద్దేవా చేస్తున్నారు.


పులివెందులలో తగ్గిన జగన్‌ ఆధిక్యం

కూటమి సునామీ ప్రభావం పులివెందులలో జగన్‌ పైనా కనిపించింది. గత ఎన్నికల్లో 90,110 ఓట్ల మెజారిటీ సాధించిన జగన్‌.. ఈ సారి 61,687 ఓట్ల మెజారిటీకే పరిమితమయ్యారు. 28,423 ఓట్ల మెజారిటీ తగ్గింది. 2019లో ఇక్కడ తెదేపా అభ్యర్థికి 42,246 ఓట్లు రాగా, ఇప్పుడు 54,628 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి సైతం ఇప్పుడు 10,083 ఓట్లు వచ్చాయి. 


‘‘చంద్రబాబుగారూ... ప్రజలకు మీపై ఉన్న నమ్మకానికి ఈ మహత్తర విజయం నిదర్శనం. రాజధాని లేని రాష్ట్రాన్ని తిరిగి నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా’’ 


‘‘పవన్‌ కల్యాణ్‌... ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో నీకు తెలుసు.  నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు ‘గేమ్‌ ఛేంజర్‌’వి మాత్రమే కాదు, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కూడా అని అందరూ కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతోంది.’’ 

-చిరంజీవి


గుండు ఎప్పుడు బొత్స? నామకరణం ఎప్పుడు ముద్రగడ?

గాది తర్వాత తెదేపా, జనసేన పార్టీలు ఉంటే గుండు కొట్టించుకుంటానన్నారు మంత్రి బొత్స. పవన్‌ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నారు ముద్రగడ. తునిలో తనకు 15 వేల కంటే తక్కువ మెజారిటీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు మంత్రి దాడిశెట్టి రాజా.  ఈ భీషణ ప్రతిజ్ఞలను ఎప్పుడు నెరవేర్చుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 


మడకశిరలో వైకాపాను దెబ్బకొట్టిన నోటా

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో నోటా ఓట్లు అభ్యర్థులను దెబ్బకొట్టాయి. ఇక్కడ తెదేపా అభ్యర్థి ఎంఎస్‌ రాజుకు 79,983 ఓట్లు రాగా.. వైకాపా అభ్యర్థి ఈర లక్కప్పకు 79,632 ఓట్లు పోలయ్యాయి. 351 ఓట్లతో తెదేపా అభ్యర్థి ఎంఎస్‌ రాజు గెలుపొందారు. ఇక్కడ నోటాకు 2,728 ఓట్లు పోలయ్యాయి. ఇది విజేత మెజారిటీతో పోలిస్తే 7 రెట్లు అధికం కావడం విశేషం.  


ఉరవకొండ సెంటిమెంట్‌కు బ్రేక్‌ 

నంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్‌ ఉండేది. తాజా ఎన్నికల్లో తెదేపా నుంచి పయ్యావుల కేశవ్‌ విజయం సాధించగా.. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టనుంది.


తాడేపల్లిగూడెం తీర్పు విలక్షణం

శ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 1999 నుంచి 2024 వరకు ఇక్కడ జరిగిన ఆరు ఎన్నికల్లో ఆరు వేర్వేరు పార్టీల అభ్యర్థులు గెలిచారు. 1999లో తెదేపా, 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014లో భాజపా, 2019లో వైకాపా, 2024లో జనసేన అభ్యర్థులు గెలిచారు. 


శ్రీభరత్‌కు 5,04,247 ఓట్ల భారీ ఆధిక్యం

విశాఖ ఎంపీ స్థానానికి పోటీచేసిన తెదేపా అభ్యర్థి శ్రీభరత్‌కు భారీ మెజారిటీ లభించింది. ఇక్కడ మొత్తం 13,66,795 ఓట్లు పోలవగా పోస్టల్‌ బ్యాలట్లతో కలిపి శ్రీభరత్‌కు 9,07,467 ఓట్లు,  ప్రత్యర్థి ఝాన్సీకి 4,03,220 ఓట్లు లభించాయి. దీంతో శ్రీభరత్‌ 5,04,247 ఓట్ల మెజారిటీ సాధించారు.


భీమిలిలో గంటాకు భారీ ఆధిక్యం

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో కూటమి తరఫున(తెదేపా) ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు వైకాపా అభ్యర్థి  ముత్తంశెట్టి శ్రీనివాసరావుపై 92,401 ఓట్ల మెజారిటీతో  ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో తెదేపాకు 1,76,230 ఓట్లు రాగా వైకాపాకు 83,829 ఓట్లు వచ్చాయి.  


పోలైన ఓట్లలో 68.77 శాతం నారాయణకే 

నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పొంగూరు నారాయణ 70,513 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. నియోజకవర్గంలో 1,71,763 ఓట్లు పోలవ్వగా.. తెదేపాకు 1,18,126 వచ్చాయి. మొత్తం ఓట్లలో ఇది 68.77 శాతం.  వైకాపా అభ్యర్థి ఖలీల్‌కు 47,613 ఓట్లు వచ్చాయి.


గోరంట్ల బుచ్చయ్యదే బోణీ

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి 1,29,060 ఓట్లు సాధించి.. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి వేణుగోపాలకృష్ణపై 64,090 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలో తొలి విజయాన్ని బుచ్చయ్యచౌదరి నమోదు చేసుకున్నారు. 


రామును అన్నారు.. చివరికి నాని పరార్‌! 

‘లెక్కింపు రోజు ఉదయం 10:30కే కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ఓటమి భయంతో  పారిపోతారని’ మాజీమంత్రి కొడాలి నాని గతంలో అవాకులు పేలారు. కానీ లెక్కింపు కేంద్రం నుంచి నానియే మధ్యలో వెళ్లిపోయారు. దీనిపై నెటిజన్లు ఆయనను ట్రోల్‌ చేస్తున్నారు. 


గాజువాకలో ‘పల్లా’కు రికార్డు స్థాయి మెజారిటీ

విశాఖ జిల్లా గాజువాక  తెదేపా  అసెంబ్లీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు 95,235 ఓట్ల ఆధిక్యంతో గెలిచి రాష్ట్రస్థాయిలో రికార్డు సృష్టించారు. ఇక్కడ వైకాపా అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఘోరంగా ఓటమి పాలయ్యారు. మొత్తం 3,33,611 ఓట్లకుగాను 2,32,949 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పల్లాకు 1,57,703 ఓట్లు రాగా, అమర్‌నాథ్‌కు 62,468 ఓట్లు వచ్చాయి.  


వైకాపా అరాచక పాలనపై తీర్పు ఇది 

రాష్ట్రంలో ఐదేళ్లు సాగిన వైకాపా అరాచక, అవినీతి, అస్తవ్యస్థ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని భాజపా జాతీయ కార్యదర్శి, శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన సత్యకుమార్‌ అన్నారు. సత్యకుమార్‌ మాట్లాడుతూ తన విజయం నియోజకవర్గ ప్రజలదేనన్నారు.


పవన్‌ నాపై పెట్టిన బాధ్యత నిలబెట్టుకున్నా: వర్మ

నసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తనపై పెట్టిన బాధ్యతను తప్పకుండా నిలబెట్టుకున్నానని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ అన్నారు. పవన్‌ను అసెంబ్లీ గేటు ముట్టుకోనివ్వబోమన్న వైకాపా నేతలకు ఆయన గెలుపు చెంప పెట్టు అన్నారు. ‘వైకాపా వాళ్లు మద్యం పోయించారు. ఎన్ని కుట్రలకు పాల్పడినా, పవన్‌ కల్యాణ్‌ను కూటమి తరఫున గెలిపించి శాసనసభకు పంపుతున్నాం’ అని చెప్పారు. 


ఎన్డీయే కూటమికి 55.43 శాతం ఓట్లు 

సెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, భాజపా, జనసేన కూటమికి 55.43 శాతం ఓట్లు లభించగా, వైకాపా 39.37 శాతానికే పరిమితైంది. విడివిడిగా చూస్తే తెదేపాకు 45.60 శాతం, భాజపాకు 2.83 శాతం, జనసేనకు దాదాపు 7 శాతానికి పైగా ఓట్లు దక్కాయని అంచనా. ఎన్డీయే కూటమి పార్టీలు సాధించిన ఓట్లకు... వైకాపా సాధించిన ఓట్లకు మధ్య 16.06 శాతం మేర వ్యత్యాసం ఉంది. లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమికి సుమారు 54.4 శాతం, వైకాపాకు 39.61 శాతం ఓట్లు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని