YSRCP: కదిరి వైకాపాలో వర్గ విభేదాలు.. విహారయాత్రకు మున్సిపల్‌ కౌన్సిలర్లు

అనంతపురం జిల్లా కదిరి వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మార్పు కోరుతూ అధికార పార్టీ కౌన్సిలర్లు విహారయాత్రకు వెళ్లారు.

Published : 22 Aug 2023 11:15 IST

కదిరి: అనంతపురం జిల్లా కదిరి వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మార్పు కోరుతూ అధికార పార్టీ కౌన్సిలర్లు విహారయాత్రకు వెళ్లారు. 16 మంది మున్సిపల్‌ కౌన్సిలర్లు కేరళలోని మున్నార్‌కు బయల్దేరారు. ముందస్తు ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లకు ఛైర్‌పర్సన్‌ను మార్చాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. విహారయాత్రకు బయల్దేరిన కౌన్సిలర్లంతా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వర్గీయులు కావడం గమనార్హం. 

ప్రస్తుతం కదిరి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా నజీమున్నీషా ఉన్నారు. మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో వైకాపా తరఫున 30 మంది, తెదేపా నుంచి ఐదుగురు, ఒక స్వతంత్ర కౌన్సిలర్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని