Harish Rao: రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

Published : 03 Apr 2024 10:43 IST

హైదరాబాద్‌: రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్‌ 9నే చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ.2 లక్షల రుణం తీసుకోవాలన్నారని తెలిపారు. రేవంత్‌ మాటలు నమ్మి లక్షల మంది అప్పులు తీసుకున్నారన్నారు.

‘‘రేవంత్ ప్రకటించినట్లు డిసెంబర్‌ 9న రుణమాఫీ జరగలేదు. అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా ఒక్క రైతుకూ అందలేదు. దీన్ని ఏవిధంగా అమలు చేస్తారో స్పష్టం చేయాలి. పంట మద్దతు ధరపై రూ.500 బోనస్‌ ఇవ్వాలి. ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలి. సాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలి. రాష్ట్రంలో ఈ నాలుగు నెలల కాలంలో 209 మంది అన్నదాతలు చనిపోయారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లు, వేధింపులకు తట్టుకోలేక ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని