Harish Rao: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు?: హరీశ్‌రావు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated : 25 Feb 2024 16:30 IST

హైదరాబాద్‌: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని భారాస ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా.. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అప్పట్లో అపాయింటెడ్‌ డేని ప్రకటించలేకపోయామన్న హరీశ్‌రావు.. కొత్త ప్రభుత్వం బిల్లును అమలు చేసే తేదీని ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు గడిచినా విలీనం ఊసే లేదన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించిన నాడే.. విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు భావించారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని