HarishRao: మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దు: హరీశ్‌రావు
దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయొద్దని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఆయన లేఖ రాశారు. దేశ భద్రత, వేలాది మంది ఉద్యోగుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ‘‘ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేస్తే 8వేల మంది ఉపాధి దెబ్బతింటుంది. మొత్తంగా 25వేల మంది భవిష్యత్ అంధకారమవుతుంది. డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుందని.. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోయి మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బ తీస్తుంది’’ అని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India Canada Row: ‘భారత్-కెనడా వివాదం.. అమెరికా తలదూర్చకపోవచ్చు’
-
Chandrababu: రెండోరోజు కొనసాగుతున్న చంద్రబాబు సీఐడీ విచారణ
-
Rakshit Shetty: అతడి సంగతి నాకు తెలియదు.. నేనైతే రష్మికతో మాట్లాడుతున్నా: రక్షిత్‌శెట్టి
-
USA: అమెరికా ఖలిస్థానీలను హెచ్చరించిన ఎఫ్‌బీఐ..!
-
TDP: ‘ఇది పాకిస్థాన్ బోర్డర్ కాదు.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు’: వీడియో షేర్ చేసిన తెదేపా
-
Vizag: రుషికొండపై చకచకా పనులు.. కేసులున్నా వెనక్కి తగ్గకుండా..