ChandraBabu: చంద్రబాబు బెయిల్‌ షరతులపై హైకోర్టులో విచారణ మధ్యాహ్నానికి వాయిదా

తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్‌ షరతులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.

Updated : 01 Nov 2023 14:03 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్‌ షరతులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణను నేటి మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. బెయిల్‌ ఉత్తర్వుల్లో మరికొన్ని షరతులు విధించాలంటూ సీఐడీ మంగళవారం అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ర్యాలీలు చేయొద్దని, స్కిల్‌ కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. సీఐడీ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. 

Chandrababu: చంద్రబాబు ఇంటికి చేరిన వేళ.. కుటుంబసభ్యుల భావోద్వేగం

మరోవైపు రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల కేసును రీఓపెన్‌ చేయాలంటూ సీఐడీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను నవంబర్‌ 10కి హైకోర్టు వాయిదా వేసింది. అనంతరం ఇదే వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు వినిపించేందుకు సీఐడీ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో విచారణను నవంబర్‌ 15కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని