Hema malini: హేమమాలిని ఆస్తుల విలువ రూ.123 కోట్లు

సీనియర్‌ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమమాలిని(Hema malini) తన ఆస్తుల విలువ సుమారు రూ.123 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Published : 05 Apr 2024 20:06 IST

దిల్లీ: సీనియర్‌ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమమాలిని(Hema malini) తన ఆస్తుల విలువ సుమారు రూ.123 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా రుణాల విలువ రూ.1.4 కోట్లుగా తెలియజేశారు. అఫిడవిట్‌లో ఆమె నటనను తన వృత్తిగా పేర్కొంటూ అద్దె, వడ్డీ ఆదాయవనరులుగా వివరించారు. మాజీ ఎంపీ, నటుడు అయిన తన భర్త ధర్మేంద్ర డియోల్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు, అప్పులు రూ.6.4 కోట్లుగా పేర్కొన్నారు. వీరి చరాస్తుల్లో మెర్సిడీస్ బెంజ్, అల్‌కాజార్, రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో, మారుతీ ఈఈసీఓ సహా రూ.61 లక్షల విలువైన వాహనాలు ఉన్నాయి. అఫిడవిట్ ప్రకారం హేమమాలినిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవు. 

హేమమాలిని 2012లో ఉదయపూర్‌లోని సర్ పదంపట్ సింఘానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆమె తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయడానికి ఒకరోజు ముందు యమునా నది ఒడ్డున ఉన్న విశ్రమ్ ఘాట్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. యమునా నదిని శుభ్రం చేయడానికి కృషి చేస్తానని ప్రజలకు మాటిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని