Kangana Ranaut: కంగన రనౌత్‌ ప్రత్యర్థిగా మినిస్టర్‌..!

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని మండిలో లోక్‌సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అక్కడ కంగన (Kangana Ranaut)తో ఆ రాష్ట్ర మంత్రి పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. 

Published : 13 Apr 2024 19:03 IST

దిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని మండి (Mandi) నుంచి భాజపా (BJP) లోక్‌సభ అభ్యర్థిగా బరిలో దిగిన సినీనటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. తనపై విమర్శలు చేస్తున్న వారికి దీటుగా బదులిస్తున్నారు. ఆ స్థానం నుంచి ఆ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ బరిలో నిలవనున్నారు. ఈ విషయాన్ని ఆయన తల్లి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభాసింగ్ వెల్లడించారు. జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. కుమారుడి అభ్యర్థిత్వం గురించి మాట్లాడుతూ.. మండి ప్రజలు ఎప్పుడూ తమతోనే ఉన్నారని వెల్లడించారు. తన కుమారుడికి వ్యతిరేకంగా కంగన చేసే వ్యాఖ్యలను తాను పట్టించుకోనన్నారు. ఎంతో క్లిష్ట సమయంలో కూడా తాను ఇక్కడినుంచి గెలిచినట్లు చెప్పారు. ఆమె మాజీ సీఎం వీరభద్రసింగ్‌ సతీమణి. మండి సిట్టింగ్ ఎంపీ.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల కంగన, విక్రమాదిత్యల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె వివాదాల రాణి అని, ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్లపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు తలెత్తుతుంటాయని వ్యాఖ్యానించారు. అలాగే ఆమె బీఫ్ తిననంటూ చేసిన పోస్టపై స్పందిస్తూ.. ‘‘ఆమెకు బుద్ధి ప్రసాదించాలని రాముడిని ప్రార్థిస్తున్నా. ఆమె దేవభూమి హిమాచల్‌ నుంచి బాలీవుడ్‌కు స్వచ్ఛంగా తిరిగి వెళ్తుందని ఆశిస్తున్నా. ఎందుకంటే ఆమెకు ఏమీ తెలియదు. ఆమె ఎన్నికల్లో గెలవరు’’ అని వ్యాఖ్యానించారు. దీనికి నటి కౌంటర్ ఇచ్చారు. ఈ రాష్ట్రం ఆయన తాతల ఎస్టేట్‌ ఏమీ కాదని, తనను బెదిరించి వెనక్కి పంపించలేరన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, విక్రమాదిత్య సింగ్‌లను కంగన ‘పప్పూ’గా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని