Eknath Shinde: ఏదో డిమాండ్‌ చేద్దామని కాదు.. మోదీకి మద్దతిచ్చేందుకే వచ్చా: శిందే

¸కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరుతుందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌శిందే అన్నారు.

Published : 05 Jun 2024 17:51 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సారథ్యంలోనే కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే అన్నారు. బుధవారం దిల్లీకి విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకే మెజార్టీ స్థానాలు వచ్చాయని.. కొత్త ప్రభుత్వం మోదీ  సారథ్యంలోనే ఏర్పాటవుతుందన్నారు. శిందే సారథ్యంలోని శివసేన మహారాష్ట్రలో ఏడు స్థానాలు గెలుచుకొని ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉంది. కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి కోరుతున్నారా? అని విలేకర్లు ఆయన్ను ప్రశ్నించగా.. ‘ఏదో డిమాండ్‌ చేయడానికి నేనిక్కడికి రాలేదు. మోదీజీకి మద్దతుగా నిలిచేందుకే వచ్చా’ అని సమాధానమిచ్చారు. 

కింగ్‌ మేకర్‌.. జాతీయ ఛానెళ్లలో చంద్రబాబుపై ఆసక్తికర కథనాలు

గత పదేళ్లలో ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ దేశాన్ని అభివృద్ధి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లారని కొనియాడిన శిందే.. ప్రతిపక్ష కూటమికి మోదీని తొలగించాలన్న సింగిల్‌ పాయింట్‌ అజెండా తప్ప ఇంకేదీలేదని ఆక్షేపించారు. అందువల్లే వారిని అధికారంలోకి రానివ్వకుండా ప్రజలు అడ్డుకున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన శిందే.. సరపడా సీట్లు లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని