TDP: పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు

పోలింగ్‌ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

Updated : 20 May 2024 15:28 IST

అమరావతి: పోలింగ్‌ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పల్నాడు జిల్లాలో ఓటింగ్‌ అంతా తెదేపా కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఎస్పీకి, మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయని కట్టుకథలు అల్లుతున్నారు. ఒక కులం, వర్గానికి నన్ను పరిమితం చేసే కుట్ర జరుగుతోంది.

దొండపాడు గ్రామంలో నాపైనే దాడి జరిగింది. నా కాన్వాయ్‌ను ధ్వంసం చేస్తున్నా పోలీసులు సహాయం చేయలేదు. ఆ రోజు నాతోపాటు ప్రయాణించిన వారి ఫోన్‌ డేటాను సిట్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మేము ఇచ్చిన లేఖలోని అంశాలను పరిశీలించాలని సిట్‌ను కోరుతున్నాను. ఎంపీగా ఉండి మేమే గొడవలు సృష్టించామని చెప్పడం సరికాదు. వైకాపా చేస్తున్న ఆరోపణలతో నాకు ఏ మాత్రం సంబంధం లేదు. పల్నాడు ఓటర్లలో కసి ఉంది కాబట్టే 86 శాతం ఓటింగ్‌ నమోదైంది’ అని లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని