Lok Sabha Elections: మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ

తాను అడిగే ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేరని, అందుకే తనతో చర్చకు నిరాకరిస్తున్నారని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

Published : 18 May 2024 23:04 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమేనని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఉద్ఘాటించారు. కొంతమంది వ్యాపారవేత్తలతో ఆయనకు ఉన్న సంబంధాలు, ఎన్నికల బాండ్లను ఎలా దుర్వినియోగం చేశారనే ప్రశ్నలు అడుగుతానని చెప్పారు. వాటికి ఆయన సమాధానం చెప్పలేరని, అందుకే తనతో చర్చకు నిరాకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో దిల్లీలో నిర్వహించిన ప్రచారంలో రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు.

‘‘పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీల నుంచి టెంపోల కొద్దీ నల్లడబ్బు కాంగ్రెస్‌కు ఏమైనా అందిందా? అని మోదీ ఇటీవల ప్రశ్నించారు. కానీ, ఈ వ్యవహారంపై దర్యాప్తునకు మాత్రం ఆయన సాహసం చేయరు’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఎలాగైనా నాశనం చేయాలని భావిస్తోన్న వారి నుంచి దాన్ని రక్షించడమే మనందరి మొదటి లక్ష్యం కావాలని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ‘అగ్నివీర్‌’కు ముగింపు పలుకుతామని, జీఎస్టీని సరళీకరిస్తామని, బడా పారిశ్రామికవేత్తలకు కాకుండా చిన్న వ్యాపారులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు

‘‘మా పార్టీలో పిరికి నేతలు అవసరం లేదు. మాకు బబ్బర్ షేర్‌ (సింహాలు)లు కావాలి. సీబీఐ, ఈడీ దాడులకు భయపడేవారు కాదు’’ అని భాజపాలో చేరిన నాయకులను ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తాను ఆప్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌కు ఓటేయనుండటం ఆసక్తికర విషయమని తెలిపారు. ‘ఇండియా’ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా దేశ రాజధాని దిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో మూడింట కాంగ్రెస్‌, నాలుగింట ఆప్‌ అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆరోవిడతలో భాగంగా ఈనెల 25న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని