Congress: ₹500కే గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు ₹10వేలు: సీఎం గహ్లోత్‌ హామీలు

Assembly Elections: రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ భారీ హామీలు ప్రకటించింది.

Published : 25 Oct 2023 16:23 IST

జైపుర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Rajasthan Assembly polls) కాంగ్రెస్‌ హామీల వర్షం కురిపిస్తోంది. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా గహ్లోత్‌ సర్కార్‌ భారీ హామీలను ప్రకటించింది. మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలోని దాదాపు 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500లకే వంట గ్యాస్‌ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌(Ashok Gehlot) ప్రకటించారు. అలాగే, ప్రతి కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10వేలు చొప్పున గౌరవ వేతనంగా ఇస్తామన్నారు. బుధవారం ఝున్‌ఝునులో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గృహ లక్ష్మీ గ్యారెంటీ పథకంలో భాగంగా మహిళలకు ₹10వేల మొత్తాన్ని వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తామన్నారు. 

అధిష్ఠానం ఎక్కడ చేయమంటే అక్కడే పోటీ: కోమటిరెడ్డి

 కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కేంద్రంలోని భాజపా సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఎంపిక చేసిన కొందరు పారిశ్రామికవేత్తల కోసమే కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది తప్ప.. ప్రజా సమస్యల్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రజల్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. కేవలం అధికారంలో ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవలనుకుంటున్నారని ఆక్షేపించారు. ఎన్నికల సమయంలో కులం, మతం గురించి మాట్లాడితేనే ఓట్లు పడతాయని భాజపా భావిస్తోందన్నారు.  దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపే వ్యక్తులకు విజన్‌ ఉండాలని.. అప్పుడే ప్రజలకు అభివృద్ధి పనులు చేయగలరని తెలిపారు. కానీ, మోదీ సర్కార్‌కు ప్రజల అభ్యున్నతిపై దృష్టిలేదని.. కేవలం కొద్ది మంది తమ మిత్రుల కోసం మాత్రమే ప్రధాని పనిచేస్తున్నారని విమర్శించారు.  మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు కలిగిన రాజస్థాన్‌ శాసనసభకు నవంబర్‌ 25న పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని