Komatireddy Venkat Reddy: అధిష్ఠానం ఎక్కడ చేయమంటే అక్కడే పోటీ: కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన రెండో విడత జాబితా సిద్ధమవుతుందని.. దాన్ని ఈ నెల 26న అధిష్ఠానం విడుదల చేస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Published : 25 Oct 2023 14:52 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన రెండో విడత జాబితా సిద్ధమవుతుందని.. దాన్ని ఈ నెల 26న అధిష్ఠానం విడుదల చేస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆరు స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయని.. ఆ స్థానాలకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన పలువురు భారాస నేతలు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కాంగ్రెస్‌లో చాలా మంది చేరుతున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి చేరిక విషయం తనతో మాట్లాడలేదని.. అధిష్ఠానంతో చర్చించారని చెప్పారు. వామపక్షాలకు నాలుగు సీట్లంటే తక్కువేమీ కాదన్నారు. మిర్యాలగూడ స్థానాన్ని వామపక్షాలు అడిగాయని.. కానీ అక్కడ ఓటు ఎంతవరకు బదిలీ అవుతుందనేది చూడాలన్నారు. పొత్తులపై సాయంత్రానికి క్లారిటీ వస్తుందని చెప్పారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 70-80సీట్లు వస్తాయని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనకు అధిష్ఠానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని