INDIA bloc: అది ‘కుటుంబ పార్టీల కూటమి’.. కొంతమంది జైల్లో, మరికొందరు బెయిల్‌పై : నడ్డా

విపక్షాల ‘ఇండియా’ (INDIA bloc) కూటమి నేతల్లో కొంతమంది జైళ్లో ఉంటే, మరికొందరు బెయిల్‌పై బయటకు వచ్చారని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) వ్యాఖ్యానించారు.

Published : 03 Apr 2024 19:54 IST

జైపుర్‌: విపక్షాల ‘ఇండియా’ (INDIA bloc) అనేది కుటుంబ పార్టీల కూటమి అని భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) వ్యాఖ్యానించారు. అందులో కొంతమంది నేతలు జైళ్లో ఉంటే, మరికొందరు బెయిల్‌పై బయటకు వచ్చారని విమర్శించారు. రాజస్థాన్‌ ఝాలావాడ్‌ జిల్లాలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార (Lok Sabha Elections) సభలో పాల్గొన్న ఆయన విపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు.

‘విపక్షాల ఇండియా కూటమి అనేది అవినీతి రక్షణ కూటమి. అందులో ఉన్న పార్టీల అధ్యక్షులు, జనరల్‌ సెక్రటరీలు, మంత్రులు కూడా కుటుంబనేపథ్యం కలిగి ఉన్నవారే. రాహుల్‌ గాంధీ బెయిల్‌, సోనియా గాంధీ, చిదంబరం, సంజయ్‌ సింగ్‌ (ఆప్‌ ఎంపీ) వంటి నేతలు బెయిల్‌పై ఉన్నారా? లేదా? అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా జైల్లో ఉన్నారా? లేదా? ఇలా విపక్ష కూటమికి చెందిన నేతల్లో సగం మంది జైళ్లో ఉంటే, సగం మంది బెయిల్‌పై ఉన్నారు’ అని భాజపా చీఫ్‌ జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు.

భాజపాలో చేరకుంటే నా అరెస్టు తప్పదట

ఆ కూటమి నేతలకు దేశ ప్రయోజనాలు పట్టవని, వారి కుటుంబాలు, పార్టీలను రక్షించుకోవడంలోనే నిమగ్నమయ్యారని నడ్డా ఆరోపించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని తమ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం పాటుపడుతోందన్నారు. మోదీ అధికారం చేపట్టిన తర్వాత 18వేల గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించామన్నారు. ఇదిలాఉంటే, రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న 12 స్థానాలకు ఏప్రిల్‌ 26న 13 చోట్ల పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని