JP Nadda: అదో అవినీతి నేతల దురహంకార కూటమి.. నడ్డా విమర్శలు

మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Published : 10 Apr 2024 17:24 IST

డోయిముఖ్‌: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha) హ్యాట్రిక్‌ విజయం సాధించడమే లక్ష్యంగా భాజపా సర్వశక్తులు ఒడ్డుతుంటే.. మోదీ సర్కార్‌ను గద్దె దించడమే ధ్యేయంగా విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార బరిలోకి దిగిన అధికార, విపక్ష పార్టీల అగ్ర నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇండియా కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఇండియా’ కూటమి అనేది అవినీతి, వారసత్వ రాజకీయాలతో నిండిన దురహంకారుల కూటమి అన్నారు. ఏప్రిల్‌ 19న అరుణాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ బుధవారం ఆయన అక్కడ పర్యటించారు.

ఈసందర్భంగా నడ్డా భాజపా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. విపక్ష కూటమి అవినీతిపరులైన నేతలకు ఆశ్రయం కల్పిస్తోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ అవినీతి వ్యతిరేకి కాగా.. విపక్ష నేతలు చాలామంది కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒకవైపు అవినీతిపై ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధం చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష కూటమి అవినీతి నేతలను కాపాడుతోందన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేయకుండా స్వార్థ ప్రయోజనాల కోసమే ఆలోచించే కూటమి అని ధ్వజమెత్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని