INDIA bloc: జూన్ 1న ఇండియా కూటమి సమావేశం..భవిష్యత్‌ ప్రణాళికలపై చర్చ

ఎన్నికల ఫలితాలకు ముందు జూన్‌ 1న ఇండియా కూటమి అగ్ర నేతలు సమావేశమవనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Published : 27 May 2024 17:37 IST

దిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA bloc) అగ్రనేతలు  జూన్ 1న దిల్లీలో సమావేశమవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో భాగంగా వారు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారని సమాచారం. 

పార్టీ నివేదికల ప్రకారం ఈ చర్చల్లో కాంగ్రెస్‌ అగ్రనేతలు, కూటమి నేతలు, ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు పాల్గోనున్నారు. ఇండియా కూటమిలో భాగంగా ఆప్ దిల్లీ, గోవా, గుజరాత్, హర్యానాల్లో కాంగ్రెస్‌తో సీట్ల భాగస్వామ్యంపై ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో రెండుచోట్ల కాంగ్రెస్‌కు పోటీగా బరిలోకి దిగింది. 

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి  28 మంది సభ్యులతో కూడిన ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా కూటమి) గత ఏడాది జులైలో ఏర్పడింది.  కాగా ఎన్డీఏ (NDA)  కూటమి  కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. ప్రధానిగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్‌ సొంతం చేసుకోవాలని మోదీ(PM Modi) కృషి చేస్తున్నారు.  కాగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమయ్యాయి. ఆరు దశల్లో పోలింగ్‌ నిర్వహించారు. జూన్‌ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని