CPI Narayana: ఇంతకాలం బెయిల్‌పై ఉన్న వ్యక్తి జగన్‌ మాత్రమే : సీపీఐ నేత నారాయణ

భాజపాకు మద్దతు ఇవ్వనందుకే తెదేపా అధినేత చంద్రబాబును జైలుకు పంపారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.

Updated : 24 Nov 2023 11:11 IST

ఖమ్మం: భాజపాకు మద్దతు ఇవ్వనందుకే తెదేపా అధినేత చంద్రబాబును జైలుకు పంపారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘కేంద్రం కాళ్లపై జగన్‌ పడటంతోనే పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారు. స్వతంత్ర భారతంలో ఇంతకాలం బెయిల్‌పై ఉన్న వ్యక్తి జగన్‌ మాత్రమే. లిక్కర్‌ స్కామ్‌ నుంచి కవితను తప్పించేందుకు ప్రధాని మోదీకి కేసీఆర్‌ దాసోహం అయ్యారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే’’ అని నారాయణ వ్యాఖ్యానించారు.

‘జగన్‌ ఏలుబడిలో..’ క్రీడా వికాసం ఉత్తిదే..!

న్యాయస్థానాలంటే సీఎం జగన్‌కు లెక్కలేదా?

విశాఖకు ప్రభుత్వ శాఖల తరలింపుపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే తరలించారు. న్యాయస్థానాలంటే సీఎం జగన్‌కు లెక్కలేదా? హైకోర్టు తీర్పు ఉల్లంఘిస్తూ విశాఖకు తరలించడం దేనికి సంకేతం? ప్రభుత్వ శాఖలను దొడ్డిదారిన విశాఖకు తరలించారు. కృష్ణా నదితో విశాఖకు ఏమాత్రం సంబంధం లేదు. కృష్ణానదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించడం తగునా? ఎన్నికల వేళ జగన్‌ 3 రాజధానుల కుట్రకు తెరలేపారు. ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా జగన్‌ మార్చారు’’ అని రామకృష్ణ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని