Jagga Reddy: కవితకు సీబీఐ నోటీసులు.. కొత్త నాటకం: జగ్గారెడ్డి

భాజపా, భారాస సిద్ధాంతాలు లేని పార్టీలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శించారు.

Published : 25 Feb 2024 17:14 IST

హైదరాబాద్‌: భాజపా, భారాస సిద్ధాంతాలు లేని పార్టీలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శించారు. ఆ రెండు పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడారు. సెక్యులర్‌ మాటకు కట్టుబడి ఉన్నది రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ అని పేర్కొన్నారు. ‘‘కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ మాటలకు భాజపాలో విలువ లేదు. భారాస, భాజపా లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. కొత్త నాటకానికి తెరలేపారు. కవితను అరెస్టు చేస్తే సానూభూతి వచ్చి.. ఓట్లు డైవర్ట్‌ అవుతాయని వాళ్ల లెక్క. కాంగ్రెస్ ఓట్లు చీల్చాలి అనేది వారి ఆలోచన’’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని