Kalpana Soren: ఉప ఎన్నికలో కల్పనా సోరెన్‌ విజయం

ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌.. గాండేయ్‌ ఉప ఎన్నికలో విజయం సాధించారు. 

Published : 04 Jun 2024 20:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఝార్ఖండ్‌ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ (Kalpana Soren) ఉప ఎన్నికలో విజయం సాధించారు. గాండేయ్‌ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేసిన ఆమె.. 27 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి దిలీప్‌ కుమార్‌ వర్మను ఓడించిన ఆమె గెలుపు అనంతరం మీడియాతో మాట్లాడారు.

జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. హేమంత్‌ జైలుకు వెళ్లిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కల్పనా.. 21,149 ఓట్లను గెలుచుకుని భాజపాను ఓడించారు. ‘‘నాకు మద్దతుగా నిలిచి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. జేఎంఎం సుప్రీం శిబు సోరెన్‌, హేమంత్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తా. ఇండియా కూటమి ఐక్యతతో ముందుకుసాగుతుంది’’ అని పేర్కొన్నారు.

మోదీ, అమిత్‌ షాలను ప్రజలు తిరస్కరించారు: రాహుల్ గాంధీ

మే 20న ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించగా.. 3.16 మంది ఓటర్లకు గాను 2.17 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. మనీలాండరింగ్‌ కేసులో ఈ ఏడాది జనవరిలో మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆయన రాజీనామాతో కల్పనాకే పాలన బాధ్యతలు దక్కుతాయని అంతా ఊహించారు. కానీ, అలా జరగలేదు. పార్టీ సీనియర్‌ నేత చంపాయి సోరెన్‌ సీఎంగా పీఠమెక్కారు. తన భర్త అరెస్టు వెనక భాజపా కుట్ర పన్నిందంటూ ఆరోపించిన ఆమె.. ఇండియా కూటమి తరఫున జోరుగా ప్రచారం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు