Nadendla Manohar: బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల

బాధితుల వేదన ప్రసారం చేయడం తప్పెలా అవుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు.

Published : 20 May 2024 21:17 IST

అమరావతి: బాధితుల వేదన ప్రసారం చేయడం తప్పెలా అవుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. విశాఖలో బాధితులు చెప్పిందే మీడియా చూపించిందన్నారు. మీడియా ప్రతినిధులను భయపెట్టే చర్యలు సరికాదన్నారు. మీడియాపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అర్థమవుతోందన్నారు. ధనలక్ష్మి కుటుంబంపై దాడికి కారకులెవరో పోలీసులే చెప్పాలని డిమాండ్ చేశారు.

విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైకాపా శ్రేణులు దాడి చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. ఈ ఘటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన సంస్థలపై కేసులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే తెదేపా నేత అచ్చెన్నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. మీడియా సంస్థలపై పెట్టిన కేసులు ఎత్తివేసి, కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని