Jyotiraditya Scindia : ‘హిందీ చీనీ భాయ్‌ భాయ్‌’ నినాదాలు చేసింది కాంగ్రెస్సే : కేంద్రమంత్రి సింధియా

సరిహద్దులో చైనా (China) ఆక్రమణల గురించి కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul gandhi) చేసిన ఆరోపణలకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia)  దీటుగా బదులిచ్చారు. 

Published : 20 Aug 2023 18:50 IST

దిల్లీ : ఒక్క అంగుళం భూమి కూడా మనం కోల్పోలేదని ఎన్డీయే ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) చేసిన విమర్శలపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) మండిపడ్డారు. ఇలాంటి విమర్శలు చేసే ముందు కాంగ్రెస్‌ ఆత్మపరీశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. ‘కాంగ్రెస్‌ చైనాకు (China) మద్దతిచ్చింది. ‘హిందీ చీనీ భాయ్‌ భాయ్‌’ అంటూ నినాదాలు చేసింది. వారే 45వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని వదిలిపెట్టారు. అలాంటి వారు విమర్శలు చేసే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని’ సింధియా సూచించారు. 

రాష్ట్రంలో ఆకలి లేని రోజులు తెచ్చుకున్నాం: సీఎం కేసీఆర్‌

అంతకముందు లద్దాఖ్‌లోని లేహ్‌లో తన పర్యటన సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ‘మన భూభాగంలోకి చైనా సైన్యం ప్రవేశించిందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇంతకుముందు పశువుల మేతకు వినియోగించిన ప్రదేశానికి ఇప్పుడు వెళ్లలేకపోతున్నామని అంటున్నారు. ఒక్క అంగుళం కూడా మన భూమి కోల్పోలేదని ప్రధాని చెబుతున్న మాటలు వాస్తవం కాదని వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. లద్దాఖ్‌లో ఎవర్ని అడిగినా.. ఇదే విషయం చెబుతారు’ అని పేర్కొన్నారు. రాహుల్‌.. ఆర్టికల్‌ 370 రద్దుపైనా మాట్లాడారు. వీరికి కల్పించిన హోదాపై ఇక్కడి ప్రజలు సంతోషంగా లేరని.. దీనిపై స్థానికుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని