Kanakamedala: పిన్నెల్లిని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి: కనకమేడల

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు.

Published : 24 May 2024 14:20 IST

అమరావతి: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు. దీనికి సంబంధించి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మాచర్ల నియోజకవర్గం సమస్యాత్మక ప్రాంతమైనా సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదు. దేశంలో ఎక్కడా లేని రీతిలో హింస చోటు చేసుకున్నా అరెస్టు లేదు. ఈసీ అరెస్టు చేయాలని ఆదేశించినా పోలీసులు జాప్యం చేశారు. హింసాత్మక చర్యలకు సహకరించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారు. తెదేపా ఏజెంట్‌ నంబూరిపై హత్యాయత్నం చేసినా కేసు లేదు. కౌంటింగ్‌లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా అన్న అనుమానం కలుగుతోంది.

రాష్ట్రంలో పలువురు అధికార దుర్వినియోగానికి పాల్పడి, అధికార వైకాపాకు సహకరించే విధంగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినంత అధికార దుర్వినియోగం, అక్రమాలు, హింసాకాండ మరే రాష్ట్రంలో లేదు. పిన్నెల్లిని అరెస్టు చేసి ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి. కౌంటింగ్‌కు సీఈసీ రాష్ట్రంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి. భద్రతా చర్యలను స్వయంగా ఎన్నికల కమిషనే పర్యవేక్షించాలి’’ అని కనకమేడల డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు