Kangana Ranaut: ‘ఇక మీ లగేజ్‌ సర్దుకోండి’ ప్రత్యర్థికి కంగనా కౌంటర్‌

భాజపా తరఫున మండి ఎన్నికల బరిలోకి దిగిన ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ విజయం సాధించారు. గెలుపు సొంతం చేసుకున్న ఆమె తన ప్రత్యర్థి విక్రమాదిత్యపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.

Published : 04 Jun 2024 16:55 IST

మండి: ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఎన్నికల్లో విజయం సాధించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన ఆమె 71 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ నేత విక్రమాదిత్య సింగ్‌ను చిత్తుగా ఓడించారు. రాజకీయ అరంగేట్రంలోనే జయకేతనం ఎగురవేసిన కంగనా.. గెలుపుపై హర్షం వ్యక్తంచేశారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె ప్రత్యర్థిపై విమర్శలు గుప్పించారు.

‘‘మండి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో కంగనా ఓటమి ఖాయం. ఫలితాల అనంతరం ఆమె ముంబయికి తిరిగి వెళ్లిపోతారు’’ అని గతంలో విక్రమాదిత్య ఎద్దేవా చేశారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కంగనా కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఒక మహిళను తక్కువ చేసి మాట్లాడడం వల్ల కలిగే పరిణామాలను వారు కచ్చితంగా చూడాల్సి వస్తుంది. తన బిడ్డను అవమాస్తే మండి చూస్తూ ఊరుకోదు. ఇక కాంగ్రెస్‌ నేత తన లగేజ్‌ను సర్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వీలైనంత త్వరగా ఇక్కడినుంచి వెళ్లిపోండి’’ అని విక్రమాధిత్యను ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌ లోయలో.. మాజీ ముఖ్యమంత్రులకు భంగపాటు!

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కంగనా రనౌత్‌.. రాజకీయాల్లోకి ప్రవేశించిన తక్కువ కాలంలోనే ప్రజలకు మరింత దగ్గరయ్యారు. భాజపా (BJP) తరఫున మండి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆమె.. ప్రత్యర్థి విక్రమాదిత్యను ఓడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు