Jammu Kashmir: కశ్మీర్‌ లోయలో.. మాజీ ముఖ్యమంత్రులకు భంగపాటు!

లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ-కశ్మీర్‌లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలు తమ ఓటమిని అంగీకరించారు.

Published : 04 Jun 2024 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir)లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు గట్టి షాక్‌ తగిలింది. 2019లో ‘ఆర్టికల్‌ 370’ రద్దు అనంతరం నిర్వహించిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections Results) ఇద్దరూ ఓటమి బాటపట్టారు. వారే.. పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ (Mehbooba Mufti), నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah). కౌంటింగ్‌ కొనసాగుతుండగానే ఇద్దరూ తమ ఓటమిని అంగీకరించడం గమనార్హం.

కశ్మీర్‌ లోయలోని ‘అనంతనాగ్‌- రాజౌరీ’ నుంచి పోటీ చేసిన మెహబూబా ముఫ్తీ.. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన మియా అల్తాఫ్‌ అహ్మద్‌తో పోలిస్తే 2.79 లక్షల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. బారాముల్లా నుంచి బరిలో దిగిన ఒమర్‌ అబ్దుల్లాపై మాజీ ఎమ్మెల్యే, జైలునుంచే పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్‌ రషీద్‌ షేక్‌ దాదాపు 1.95 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లే నిర్ణేతలని, ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్లు ఇద్దరు నేతలు స్పందించారు.

బెంగాల్‌లో బెనర్జీ దూకుడు.. చతికిలపడ్డ భాజపా

జమ్మూ స్థానంలో భాజపా అభ్యర్థి జుగల్‌ కిశోర్‌ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రత్యర్థి రమణ్‌ భల్లా, బీఎస్పీ అభ్యర్థి జగదీశ్‌ రాజ్‌లు రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యారు. ఉధంపుర్‌లోనూ కమలదళం సత్తా చాటుతోంది. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన లాల్‌సింగ్‌పై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ దాదాపు లక్షకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. శ్రీనగర్‌లో ఎన్సీ అభ్యర్థి ఆగా సయ్యద్‌ రుహుల్లా మెహ్దీ.. పీడీపీ నేత వహీద్‌ ఉర్‌ రెహ్మన్‌ పారాపై దాదాపు 1.62 లక్షల ఓట్లతో ముందంజలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు