Kejriwal: ‘తర్వాత అరెస్టు ఆమెదేనని ముందే చెప్పా కదా!’: కేజ్రీవాల్‌ ట్వీట్‌

పరువు నష్టం కేసులో దిల్లీ మంత్రి అతిశీకి కోర్టు సమన్లు ఇవ్వడంపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ స్పందించారు.

Published : 28 May 2024 18:34 IST

దిల్లీ: పరువు నష్టం కేసులో ఆప్‌ కీలక నాయకురాలు, దిల్లీ మంత్రి ఆతిశీ (Atishi)కి  దిల్లీ కోర్టు సమన్లు జారీ చేయడంపై సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఈమేరకు ట్వీట్‌ చేశారు. ‘‘తర్వాత అరెస్టు అతిశీదేనని ముందే నేను చెప్పాను. ఇప్పుడు ఆ దిశగానే వాళ్లు ప్లాన్‌ చేస్తున్నారు. ఇది పూర్తిగా నియంతృత్వం.  పూర్తిగా నకిలీ, తప్పుడు కేసుల్లో ఆప్‌ నేతలందిరనీ ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తున్నారు. మరోసారి నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే.. ప్రతిపక్ష నేతలందరినీ ఒకరి తర్వాత ఒకరిని అరెస్టు చేస్తారు. ఆప్‌ ముఖ్యం కాదు.. నియంతృత్వం నుంచి మన ప్రియమైన దేశాన్ని కాపాడుకోవడం ముఖ్యం’’ అని పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపు అభ్యర్థన.. అత్యవసర విచారణకు సుప్రీం నో

ఆప్‌ ఎమ్మెల్యేల్ని ప్రలోభాలకు గురిచేసి వారికి భారీగా డబ్బు ఎరవేసి కొనేందుకు భాజపా ప్రయత్నించిందంటూ అతిశీ గతంలో ఆరోపించారు. దీనిపై భాజపా మీడియా విభాగం హెడ్‌ ప్రవీణ్ శంకర్ కపూర్‌ ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన దిల్లీ కోర్టు ఈ కేసులో జూన్‌ 29న విచారణకు హాజరుకావాలని అతిశీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంపై కేజ్రీవాల్‌ పైవిధంగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని