Kesineni Nani: రాజకీయ ప్రయాణం ముగిస్తున్నా మాజీ ఎంపీ కేశినేని నాని వెల్లడి

మాజీ ఎంపీ, వైకాపా నేత కేశినేని శ్రీనివాస్‌ (నాని) సంచలన ప్రకటన చేశారు. తన రాజకీయ ప్రయాణం ముగిస్తున్నట్లు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. కొత్త ప్రయాణం ప్రారంభిస్తానని పేర్కొన్నారు.

Published : 11 Jun 2024 05:59 IST

ఈనాడు, అమరావతి: మాజీ ఎంపీ, వైకాపా నేత కేశినేని శ్రీనివాస్‌ (నాని) సంచలన ప్రకటన చేశారు. తన రాజకీయ ప్రయాణం ముగిస్తున్నట్లు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. కొత్త ప్రయాణం ప్రారంభిస్తానని పేర్కొన్నారు. రెండు పర్యాయాలు విజయవాడ ఎంపీగా తెదేపా తరఫున నాని గెలుపొందిన విషయం తెలిసిందే. తన రాజకీయ ప్రయాణంలో ఆయన మూడు పార్టీలు మారారు. 2009లో ప్రజారాజ్యంలో చేరారు. కానీ విజయవాడ నుంచి పోటీకి టికెట్‌ రాలేదు. 2013లో చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా తెదేపాలో చేరారు. 2014, 2019లో తెదేపా తరఫున విజయవాడ ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన చంద్రబాబు నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. 2024లో పార్టీ మారి వైకాపాలో చేరారు. తాజా ఎన్నికల్లో వైకాపా నుంచి విజయవాడ పార్లమెంటుకు పోటీ చేసి తన సోదరుడు, తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని) చేతిలో 2.82 లక్షల ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోయారు. సోమవారం ఆయన ఎక్స్‌ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. 

ప్రజలే తప్పించారు: కేశినేని నాని ట్వీట్‌పై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ‘అయ్యా కేశినేని నాని .. మీరు రాజకీయాల నుంచి తప్పుకోవడం కాదు.. ప్రజలే మిమ్మల్ని తప్పించారు’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని